Rahul Gandhi | మాకూ సమయం వస్తుంది, మిమ్మల్ని విడిచిపెట్టం.. ఎన్నికల సంఘానికి రాహుల్‌గాంధీ హెచ్చరికలు..!
Rahul Gandhi | ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై వివాదం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader), లోక్‌సభ (Lok Saha) లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల సంఘం (Election Commission) పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్నది తప్పని వ్యాఖ్యానిస్తూ.. ‘సమయం వస్తుంది.. మిమ్మల్ని వదలం’ అని హెచ్చరించారు.
Rahul Gandhi : ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై వివాదం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader), లోక్‌సభ (Lok Saha) లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల సంఘం (Election Commission) పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్నది తప్పని వ్యాఖ్యానిస్తూ.. ‘సమయం వస్తుంది.. మిమ్మల్ని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.
ఓటు చోరీ భారత ప్రజలపట్ల నేరమని, రాజ్యాంగంపై నేరుగా దాడి చేయడమేనని ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ఓ వీడియోను కూడా రాహుల్‌గాంధీ పంచుకున్నారు. ఎన్నికల సంఘానికి, ఎన్నికల అధికారులకు స్పష్టంగా చెబుతున్నానని, వారు చేస్తున్నది తప్పని అన్నారు. ఇది దేశద్రోహమని విమర్శించారు. తమకు సమయం వస్తుందని, మిమ్మల్ని పట్టుకుంటామని, తమ నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు కారణమైన వివాదం ఓ పత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక కథనంతో మొదలైంది. పది నెలల వ్యవధిలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు నిర్ణయాలపై కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు ఆ కథనం పేర్కొన్నది.
కొత్త ఓటర్ల చేర్పు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ వంటి అంశాలు అందులో ఉన్నట్లు ఈసీ తెలిపింది. అయితే ఈ కథనాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇద్దరు కమిషనర్లు కొన్ని అంశాలపై అభిప్రాయాలు, సూచనలు మాత్రమే చేశారని, అధికారికంగా ఎలాంటి భిన్నాభిప్రాయం నమోదు కాలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. ‘సర్’ సహా అన్ని నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే తీసుకున్నట్లు స్పష్టంచేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవడానికి అసలు కారణం ఇదే.. పదేళ్ల తర్వాత నిజం చెప్పిన దర్శకుడు సంపత్ నంది!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

