Satyavati Rathod | రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణాలు ప్రభుత్వ హత్యలే : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
Satyavati Rathod | జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని బీఆర్ఎస్ మహిళా నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం సందర్శించారు.
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ( RIMS hospital ) లో జరిగిన అగ్నిప్రమాద ( Fire Incident ) ఘటన స్థలాన్ని బీఆర్ఎస్ మహిళా నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం సందర్శించారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ ( Satyavati Rathod ) , జోగు రామన్న ( Jogu Ramanna ) ,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, తుల ఉమా సందర్శించిన వారిలో ఉన్నారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రిమ్స్ అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. చిన్నపిల్లలు చికిత్సలు పొందే ఎస్ఎంసీయులో కనీస సౌకర్యాలు లేవని, ఏసీల నిర్వహణను అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. మరణించిన చిన్నారుల తల్లిదండ్రుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తగులుతాయన్నారు.
బీఆర్ఎస్ పాలనలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించామని , ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో వైద్యులను నియమించడంతోపాటు మందులను సైతం అందుబాటులో నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. రిమ్స్ సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేసింది ఏమీ లేదని అన్నారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

