The Paradise | టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). నేచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రేపు విడుదల కాబోతుండగా సాయంత్రం నుంచి ప్రీమియర్లు పడబోతున్నాయి. కాగా, ఈ సినిమా విడుదలకు ముందు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన బాల్యపు జ్ఞాపకాలను, సినిమా నేపథ్యాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నాడు.
ఈ చిత్రంలో నాని పాత్ర అయిన ‘జడల్’ పుట్టుక, పోరాటాలు పూర్తిగా కల్పితమే కావచ్చు… కానీ ఆ పాత్ర తల జడలు, ప్రత్యేకమైన లుక్ మాత్రం తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి పుట్టుకొచ్చినవే అని శ్రీకాంత్ ఓదెల స్పష్టం చేశారు. తాను చిన్నతనంలో పెరిగిన వాతావరణం, చూసిన యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాలోని అనేక సన్నివేశాలను తెరకెక్కించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ… తాను ఐదు లేదా ఆరో ఏట వరకు తన ‘అమ్మ’ ఎంతో ప్రేమగా తన జుట్టును పెంచి, జడలు వేసేదని శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ అయ్యారు. అలా వయసు పెరుగుతున్న కొద్దీ, ఒక కమర్షియల్ సినిమాలో హీరో 70ఎంఎం తెరపై జడలతో ఎలా కనిపిస్తాడనే ఊహ ఎప్పుడూ తన మదిలో మెదులుతూనే ఉండేదని తెలిపారు. కాలం గడిచింది, నేడు ఆ కల నిజమైంది… తన హీరో, నాని అన్నను ‘జడల్’ రూపంలో సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించడం పట్ల ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం కేవలం నా బాల్యానికి ప్రతిరూపం మాత్రమే కాదు… ఈ చిత్రమే నా స్వర్గధామం (ది ప్యారడైజ్) అంటూ శ్రీకాంత్ ఓదెల పేర్కొన్నారు. ఎన్నో భావోద్వేగాల కలబోతగా తెరకెక్కిన ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండంటూ, మరికొద్ది గంటల్లోనే ది ప్యారడైజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
Jadal’s birth and battle might be fictional…but his braids & look were inspired from my childhood… Alot of the scenes in the film are influenced by my childhood as i grew up…
Amma❤️ used to grow and tie Jadal until i turned 5 or 6 years… and as i grew older i always… pic.twitter.com/ZRs2ieAs0W
— Srikanth Odela (@odela_srikanth) September 23, 2026