వికారాబాద్ : బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్ సమీపంలో వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 16మంది ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి హైదరాబాద్లోని ఆలివ్ దవాఖానలో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం దవాఖానకు వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.