వికారాబాద్ : సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే ఆనంద్ ఫొటోను పోలి ఉండేలా ఇద్దరు అన్నదమ్ములు బొమ్మలు గీశారు. గీసిన బొమ్మను శుక్రవారం వికారాబాద్ డాక్టర్ సబితానంద్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సబితానంద్కు అందజేశారు. నారాయణఖేడ్‌కి చెందిన ఆగమప్ప, నాగరాజు ఇద్దరు (మూగ, వినికిడి లోపం కలిగిన వారు) అన్నదమ్ములు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌ల అభిమానంతో బొమ్మలు గీయడంతో అభిమానుల మనస్సు గెలుచుకున్నారు. ఆత్మ స్థెర్యంతో ముందుకు సాగుతున్న అన్నదమ్ముళ్లను ఎమ్మెల్యే ఆనంద్ సన్మానించారు. వీరితో పాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.