Vikarabad : విదేశి విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్ : విదేశి విద్యానిధి పథకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సుధారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అల్ప సంఖ్యాక వర్గాల వారు విదేశాలలో పై చదువుల నిమిత్తం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, సింగపూర్ స్ప్రింగ్, ఫాల్ సిజన్స్ 2021 ప్రవేశానికి సంబంధించిన అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలన్నారు. ఎంసీ, పోస్టు గ్రాడ్యూయేట్, డాక్టర్ కోర్సు విదేశీ విశ్వవిద్యాలయాలలో జనవరి, డిసెంబర్ 2021లో ప్రవేశం పొందిన విద్యార్థులు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
www.telanganapass.cgg.gov.in వెబ్ సైట్లో విద్యార్థుల తల్లితండ్రుల వార్షిక ఆధాయం రూ. 5 లక్షలలోపు ఉండాలన్నారు. ఇట్టి పథకం ఎంపిక చేయబడిన ప్రతి విద్యార్థికి స్కాలర్ షిప్ ఆర్థిక/సహాయం కింద రూ. 20 లక్షలు రెండు విడుతలలో చెల్లించడం, విమాన ప్రయాణ చార్జీలు రూ. 60 వేలకు మించకుండా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 26నుంచి డిసెంబర్ 31లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మిగత వివరాలకు 7993357103, 9849925473, 9705290505లను సంప్రదించాలన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

