
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా వైద్య శాఖలో ఒప్పంద, అవుట్ సోర్సింగ్‌లో పని చేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జిల్లా వైద్యాధికారి తుకారం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్హెచ్ఎం ఒప్పంద పద్ధతి ద్వారా 1 పోస్టు సైకియాట్రిస్ట్‌కు ఎండి సైకియాట్రిస్ట్ చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. ఎస్టీఎస్ 2 పోస్టులకు గాను డిగ్రీ సంబంధిత అనుభవం, కంప్యూటర్ సర్టిఫికేట్, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఎస్టీఎల్ఎస్ 1 పోస్టుకు లాబోరేటరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ డిప్లామా లేదా సంబంధిత అనుభవంతో సమానమైనది ఉండాలన్నారు. టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులన్నారు. టీబీ-హెచ్వీ 1 పోస్టుకు డిగ్రీ సంబంధిత అనుభవంతో కంప్యూటర్ సర్టిఫికేట్, టూ విలర్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు.
రిఫ్రిజిరేటర్ మెకానిక్ 1 పోస్టుకు ఐటీఐ రీఫ్రిజిరేటర్ మెకానిక్ సంబంధిత అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అవుట్ సోర్సింగ్ 3 పోస్టులు ల్యాబ్ టెక్నిషియన్‌కు బీఎస్సీ, ఎంఎల్టి/డీఎంఎల్టీ, సమానమైది ఉండాలన్నారు. అవుట్ సోర్సింగ్ 6 ఫార్మసిస్టు పోస్టులకు గాను బీ ఫార్మసి, డీ ఫార్మసి లేదా సమానమైనది ఉండాలన వివరించారు. ఈ నెల 6,7,10వ తేదీలలో సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడుతాయన్నారు. ఇతర వివరాలకు http://vikarabad.telangana.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.