బంట్వారం : అతి వేగంతో వెళ్తున్న ఆటో బోల్తపడి ఒకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బస్వపూర్ గ్రామానికి చెందిన కమ్మర పల్లి సువర్ణతో పాటు మరో ముగ్గురు ఆటోలో తాండూరు నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. సాయంత్రం 5.30 ప్రాంతంలో పెద్దెముల్ మండలం బండమీది పల్లి-తొరుమామిడి సమీపంలో అతి వేగంతో వెళ్తు ఆటో బోల్తపడింది.
దీంతో అందులో ప్రయాణిస్తున్న కమ్మరపల్లి సువర్ణకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షింయి మెరుగైన వైద్యం కోసం నగరంలోని గాంధీ దవాఖానికి రెఫర్ చేశారు.