Vikarabad | పరిగి, ఏప్రిల్ 26 : ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఎస్.శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని సబ్ జైలును జిల్లా న్యాయమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌జైలులోని ఖైదీలతో న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ క్షణికావేశంతో చేసిన తప్పులతో జైలుకు రావద్దని, మంచి అలవాట్లు ఏర్పరచుకోవాలని సూచించారు. స్నేహభావంతో మెలగాలని జడ్జి సూచించారు. అనంతరం బాలసదన్‌ను జిల్లా న్యాయమూర్తి సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ, సబ్ జడ్జి వెంకటేశ్వర్లు, పరిగి జూనియర్ సివిల్ జడ్జి శిల్ప, పరిగి సబ్‌జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, లీగల్ సర్వీస్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశ్, రాము, శ్రీనివాస్, గౌస్‌పాష, మోహన్‌లు పాల్గొన్నారు.