వికారాబాద్ : దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని తెరాసా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో 43మంది కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఎన్నో ఏళ్లుగా సాధ్యం కాని బాల్యవివాహాలు నేడు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో నియంత్రించగలిగామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తూ ఇంటి పెద్దన్నగా తోడు నిలుస్తున్నారని కొనియాడారు.
అనంతరం వికారాబాద్ మండలానికి చెందిన 43మంది లబ్ధిదారులకు రూ. 43,04,988లు అందించారని వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రమోదిని, తాసీల్దార్ షర్మిల, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు మాధవరెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు.