వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని సత్యభారతీ ఫంక్షన్హాలులో గురువారం నిర్వహించిన క్రిస్మస్ వేడులకు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. క్రిస్మస్ను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్ కుమార్, తాసీల్దార్ కృష్ణయ్య, నాయకులు జాఫర్, లక్ష్మణ్, డిప్యూటీ తాసీల్దార్ విజేందర్ పాల్గొన్నారు.