వికారాబాద్ : పట్టుదలతో ఉంటే విద్యార్థులు సాదించలేనిది ఏదీ లేదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ మున్సిపాల్ పరిధిలోని గరీబ్నగర్ కాలనీకి చెందిన సౌమ్యఆనంద్ భాస్కర్ యాదవ్ దంపతుల కూతురు అఘస్త్యయాదవ్ (6) చిన్న తనంలోనే అద్భుతమైన మేధశక్తి సంపాదించుకున్నందుకు బుధవారం ఎమ్మెల్యే చిన్నారిని అభినందించారు. అఘస్త్య చదువు, మేధశక్తి గల వీడియోలను చిన్నారి తల్లిదండ్రులు వెబ్సైట్లో పొందుపర్చడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వారు చూసి ప్రశంసా పత్రాన్ని అందజేశారని చిన్నారి తల్లీదండ్రులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారి మునుముందు ఎన్నో గొప్ప ప్రశంసాలు పొందాలని ఆకాంక్షించి దీవించారు. చిన్నారి విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో చిన్నారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.