
ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం
సీసీరోడ్లు, వైకుంఠధామం, కంపోస్టు యార్డు
హరితహరంలో మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత
రూ.50 లక్షల నిధులతో తండా అభివృద్ధి
చెత్త సేకరణలో పంచాయతీ ట్రాక్టర్
మంచాల, ఆగస్టు 22: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో కొర్రవాని తండా స్వచ్ఛతకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతతో తండా మెరిసిపోతున్నది. నూతనంగా ఏర్పడిన కొర్రవాని తండా పంచాయతీలో పల్లెప్రకృతి వనం, కంపోస్టు యార్డు, వైకుంఠధామం, సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీల నిర్మాణం పూర్తియ్యాయి. తండా సర్పంచ్ కొర్ర లక్ష్మితోపాటు పాలక వర్గ సభ్యులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దారు. రెండున్నర ఏండ్లలో రూ.50 లక్షలతో తండాలో అభివృద్ధి పనులు చేపట్టారు. రోజూ పంచాయతీ ట్రాక్టర్‌తో తండాలో తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తండాలో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించారు. మిషన్ భగీరథ నీటిని నల్లాల ద్వారా ప్రతి ఇంటికీ సరఫరా చేస్తున్నారు. వీధులను శుభ్రం చేయించడం, హరితహరంలో నాటిన మొక్కలకు నీరందించడం, సీసీరోడ్లు, ప్రతి వార్డులో విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో తండా అభివృద్ధితో పాటు రూపురేఖలే మారిపోయాయి.
తండాలో పూర్తయిన అభివృద్ధి పనులు
పల్లెప్రగతిలో భాగంగా తండాలో అభివృద్ధి పనులన్నీ పూర్తిచేశారు. రూ.2 లక్షలతో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసి, అందులో 2వేల మొక్కలు పెంచడం, రూ.2.50 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.8.40 లక్షలతో పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసి చెత్త సేకరిస్తున్నారు. ట్యాంకర్‌తో మొక్కలను నీరు పోస్తున్నారు. రూ.20 లక్షలతో ప్రతి వీధిలో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీలు ఏర్పాటు చేసుకున్నారు. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. ఇందులో స్నానాల గదులు, ఇతర సదుపాయాలు కల్పించారు.
కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది..
ముఖ్యమంత్రి కేసీఆర్ తండాను పంచాయతీగా ఏర్పాటు చేసి, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా తండాలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తున్నారు. గతంలో తండావాసులు ఎన్నో సమస్యలతో సతమతమయ్యేవారు. నేడు కేసీఆర్ పుణ్యమా అని సమస్యలన్నీ పరష్కారమవుతున్నాయి.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహకారంతో తండాలోని సమస్యలు పరిష్కరించి మరిం త అభివృద్ధి చేయడమే ధ్యే యంగా పని చేస్తాం. తం డాలోని సీసీరోడ్డు, భూగ ర్భ డ్రైనేజీ, వీధిదీపాలు, తండాలోని వీధులను శుభ్రం చేసి పరిశుభ్రతపై దృష్టి పెట్టాం. తండా అభివృద్ధికి ప్రభు త్వం నుంచి వచ్చే నిధులతో పాటు, ఎమ్మెల్యే సహకారంతో తండాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
సమస్యలు పరిష్కరిస్తున్నం..
పల్లె ప్రగతి పనులతో తం డాలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిం చాం. విద్యుత్, సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ఎ ప్పడికప్పుడు పరిష్కరిస్తు న్నాం. పల్లెప్రగతి నిధులతో తండాలో మౌలిక స దుపాయాలు కల్పిస్తున్నాం. పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. పాలకవర్గం, గ్రా మస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నాం.