
కడ్తాల్ మండలం గాన్గుమార్లతండాలో
వైభవంగా ఉత్సవాలు
డప్పు వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో ఊరేగింపు
ఆకట్టుకున్న యువతీయువకుల నృత్యాలు
ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, చెరువులో మొలకల బుట్టల నిమజ్జనం
వేడుకల్లో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి,
జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
గిరిజన మహిళల సంప్రదాయ దుస్తులు ధరించిన మంత్రి, జడ్పీ చైర్పర్సన్
కడ్తాల్ ఆగస్టు 22: తెలంగాణ సంస్కృతి సంప్రదాయలను కాపాడుకో వాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గాన్గు మార్ల తండాలో గిరిజనులు నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ముఖ్య అతి థులుగా మంత్రి, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి, జడ్పీ చైర్పర్సన్ గిరిజన మహిళల సంప్రదాయ దుస్తులను ధరించారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ గిరిజన సంస్కృతికి, సంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తున్నదని తెలిపారు. గిరిజన యువతులు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందంగా తీజ్ పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తు జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నడం ఆనందంగా ఉన్నదని మంత్రి అ న్నారు. జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదన్నారు. తీజ్ పండుగ చాలా గొప్పదని, అన్ని పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని చెప్పారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ తీజ్ పండుగ సందర్భంగా తొమ్మిది రోజులపాటు గిరిజన యువతులు ఎంతో కఠినంగా దీక్ష చేపడతారని తెలిపారు. తండాలోని యువతులు ఎంతో నియమ నిష్టలతో మొలకల బుట్టలను తయారుచేశారని పేర్కొన్నా రు. అనంతరం యువతులు తయారు చేసిన మొలకల బుట్లను మంత్రి, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే నెత్తిన ఎత్తుకున్నారు. సాయంత్రం యువతులు బట్టులను ఎత్తుకొని, డప్పుల వాయిధ్యాల మధ్య స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండాలోని చావిడి వద్ద ఏర్పాటు చేసిన మొలకల బుట్టల పందిరి వద్ద యువతీ యువకులు నృత్యాలతో సందడి చేశారు. అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, గిరిజన సేవా సంఘం రాష్ట్ర నాయకులు సేవ్యానాయక్, లక్పతినాయక్, సర్పంచ్‌లు లక్ష్మీ నర్సింహారెడ్డి, హంశ్యమోత్యానాయక్, తులసీరాంనాయక్, హరిచంద్ నాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, ప్రియ, మంజుల, ఉప సర్పంచ్ శారద, మహిళాధ్యక్షురాలు వాణీశ్రీ, నాయకులు వీరయ్య, లాయక్ అలీ, రాఘవాచారి, శ్రీనునాయక్, భీక్యానాయక్, మోత్యానాయక్, శంకర్ నాయక్, పాండునాయక్, కిషన్, జగన్, చంద్రు, గోప్య, రూప్సింగ్, తండావాసులు పాల్గొన్నారు.