చేవెళ్ల రూరల్, నవంబర్ 14 : చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తనను మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి కొనసాగిస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల, నవలయపల్లి, వెంకన్నగూడ, హస్తేపూర్, అంతారం, కుమ్మెర, మలాపూర్ గ్రామాల్లో జోరుగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పాలించిన కాంగ్రెస్ అభివృద్ధి చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజలు గుర్తుకువస్తారన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, ఆరు గ్రామాల సర్పంచ్‌లు గాయత్రి, సులోచన, విజయలక్ష్మి, వెంకటయ్య, భానుతేజ, శేరి శివారెడ్డి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు బాల్‌రాజ్, రమణారెడ్డి, కృష్ణారెడ్డి, మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జు రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు నరేందర్ గౌడ్, హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి
షాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటు ద్వారా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తిర్మలాపూర్, రేగడిదోస్వాడ, మక్తగూడ, ఏట్ల ఎర్రవల్లి, తిమ్మారెడ్డిగూడ, వెంకమ్మగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. షాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు శేరిగూడెం వెంకటయ్య, నక్క శ్రీనివాస్‌గౌడ్, డైరెక్టర్ సూద యాదయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, డైరెక్టర్లు చక్కటి దేవేందర్‌రెడ్డి, పీసరి రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం మండల యూత్ అధ్యక్షుడు పీసరి సతీశ్‌రెడ్డి, కార్యదర్శి ఎండీ మునీర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు శ్రీధర్‌రెడ్డి, రాములు, శ్రీనివాస్‌గౌడ్, మద్దూరి శకుంతల, కృష్ణాగౌడ్, ఎంపీటీసీలు పార్వతమ్మ, గుత్తి సునీత, ఉప సర్పంచ్‌లు నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు బచ్చంగారి కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, మల్లారెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, పాండు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అంజయ్యయాదవ్‌ను గెలిపించాలి
నందిగామ : షాద్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామాల్లో జోరుగా ప్రచారం
మొయినాబాద్ : బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటంటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గెలుపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గునుగుర్తి జయవంత్ ఆధ్వర్యంలో కుతుబుద్దీన్గూడ గ్రామంలో సర్పంచ్ పద్మమ్మతో కలిసి ప్రచారం చేశారు. అమ్డాపూర్ గ్రామంలో సర్పంచ్ రవళితో కలిసి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీహరియాదవ్ ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, డైరెక్టర్ సంగం రాజు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బాల్‌రాజ్, సుధాకర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, బాకారం సర్పంచ్ రాఘవరెడ్డి, కాశీంబౌలి సర్పంచ్ మహేందర్‌రెడ్డి, వార్డు సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు రాఘవేందర్‌యాదవ్, పాషా, రమేశ్ పాల్గొన్నారు.
భారీ మెజార్టీతో గెలిపించాలి
శంకర్పల్లి : ఎమ్మెల్యే యాదయ్యను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని నవాబ్‌పేట జడ్పీటీసీ, ఎమ్మెల్యే యాదయ్య సతీమణి జయమ్మ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని రామాంతాపూర్ వార్డులో, లక్ష్మారెడ్డిగూడ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేసిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, కౌన్సిలర్ అశోక్, ఏఎంసీ చైర్మన్ పాపారావు, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్‌కుమార్, వాసుదేవ్ కన్నా, గోపాల్, పాండురంగారెడ్డి, బాలకృష్ణ, ఇంద్రసేనారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గెలుపు ఖాయం
శంకర్పల్లి : చేవెళ్ల గడ్డ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఎమ్మెల్యే యాదయ్య గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధవహించి గ్రామాల రూపు రేఖలు మార్చారని అన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్, వాసుదేవ్‌కన్నా, గోవర్ధన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పాపారావు, మహమూద్, మధు, జయానంద్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు : తిమ్మాపూర్‌లో కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు మదారం నర్సింహాగౌడ్, సోమ్లానాయక్, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌యాదవ్, శ్రీనివాసులు, సదానందగౌడ్, గోవింద్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రవినాయక్ పాల్గొన్నారు.
కేశంపేట : ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్‌కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధ్దిని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.