Rangareddy | షాబాద్, ఏప్రిల్ 22 : పశువుల ఆరోగ్యం పట్ల రైతులు జాగ్రతలు పాటించాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని తిర్మలాపూర్, మద్దూర్ తండాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పరిశ్రమను పోషించుకుని జీవనం సాగించే రైతులకు మంచి ఆదాయం ఉంటుందని తెలిపారు. పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులు జాగ్రతలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది బాల్రాజు, శ్రీను, కృష్ణామూర్తి, రైతులు తదితరులున్నారు.