షాద్నగర్, జూలై 14: లారీలపై ఉన్న అదనపు పన్నును రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై లారీ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం షాద్నగర్ పట్టణ ముఖ్యకూడలిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి వారు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సయ్యద్సాదిక్ మాట్లాడుతూ పన్ను రద్దుతో లారీ, ఆటోల యజమానులకు సుమారు రూ. 640కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞ్ఞతలు తెలిపారు.