తెలంగాణ మ్యూజియంగా..పైగా ప్యాలెస్
నగరంలో చారిత్రక భవనాల్లో ఒకటైన బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ను తెలంగాణ మ్యూజియంగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది.
- ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌కు యూఎస్ కాన్సులేట్ భవనం తరలింపు
- మార్చి నుంచి ఖాళీగా ఉన్న విశాలమైన ప్యాలెస్
- ప్రస్తుతం హెచ్ఎండీఏకు నిర్వహణ బాధ్యతలు
- త్వరలోనే తెలంగాణ మ్యూజియం ఏర్పాటు
సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నగరంలో చారిత్రక భవనాల్లో ఒకటైన బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ను తెలంగాణ మ్యూజియంగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌లో కొత్తగా యూఎస్ కాన్సులేట్ భవనం నిర్మాణం పూర్తి కావడంతో, అక్కడికి ఈ కార్యాలయాన్ని మార్చారు. ఇప్పటి వరకు యూఎస్ కాన్సులేట్ సేవలు కొనసాగిన ఈ భవనం ఈ ఏడాది మార్చి నుంచి ఖాళీగా ఉంది. దీంతో బేగంపేటలోని పైగా ప్యాలెస్ భవనాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మొదటి నుంచి ఈ చారిత్రాత్మక భవనాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్‌ంఎడీఏ) ప్రధాన కార్యాలయంగా ఉంది. ఎంతో విశాలమైన పైగా ప్యాలెస్‌ను అత్యంత కీలకమైన సేవలను అందించేందుకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి ఒక మ్యూజియంను ఏర్పాటు చేస్తే, దానికి ఈ భవనం అన్ని విధాలుగా సరిపోతుందని భావిస్తున్నారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం కోర్ సిటీలో ఉండడంతో ప్రజలు ఇక్కడికి వచ్చివెళ్లేందుకు అనుకూలంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. అప్పటి వరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో దీని నిర్వహణను చేపడుతున్నారు. భవనం పరిరక్షణ కోసం ఉన్నతాధికారులు తరచూ సందర్శించడంతో పాటు ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు.
2008 నుంచి బేగంపేటలో యూఎస్ కాన్సులేట్ సేవలు…
తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా అమెరికా వీసా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇంటర్వ్యూ కోసం చెన్నైకి వెళ్లేవారు. అక్కడికి వెళ్లే వారిలో తెలుగు రాష్ట్రాల వారే 40% కంటే ఎకువ కావడంతో అప్పటి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. యూఎస్ కాన్సులేట్ కోసం బేగంపేటలో ఉన్న పైగా ప్యాలెస్‌ను కేటాయించారు. ఈ భవనంలోనే కాన్సులేట్ కార్యాలయాన్ని.. 2008 అక్టోబర్ 24న ప్రారంభించారు. స్వాతంత్య్రం పొందిన తరువాత దేశంలో మొదటి అమెరికా దౌత్యపరమైన కార్యాలయం ఇదే కావటం గమనార్హం. అలాంటి కీలకమైన కార్యాలయం కొనసాగిన పైగా ప్యాలెస్ భవనాన్ని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తిరిగి స్వాధీనం చేసుకొని, దాని నిర్వహణను పర్యవేక్షిస్తున్నది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

