Turkayanjal | తుర్కయంజాల్, జూలై 5 : హోటళ్లు, బేకరీ, చికెన్ షాపుల యజమానులు పరిశుభ్రతను పాటించాలని లేని యెడల జరిమానా విధిస్తామని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధిలోని హోటళ్లు, బేకరీ, చికెన్ షాపులలో మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనీఖీలు నిర్వహించి పలువురికి జరిమానాలు విధించారు. ఈ సందర్భముగా మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి మట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని హోటళ్లు, బేకరీ, చికెన్ షాపులలో పరిశుభ్రతను పాటించాలని లేని యెడల జరిమానా తప్పదని హెచ్చరించారు. అదే విధంగా ప్లాస్టిక్ కవర్లను సైతం వినియోగించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ అధికారి వినయ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.