భూములు తిరిగి ఇవ్వకపోతే
మా భూములు మాకివ్వండి.. లేకపోతే మాకు చావే శరణ్యమని శంకర్పల్లి మండలం మోకిలతండా గిరిజన రైతులు అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ.. గత 22 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయమని ఆవేదన చెందారు. తమ భూములు నగరానికి కూతవేటు దూరంలో ఉండి.. కోట్ల రూపాయలు ధర పలుకుతుండటంతో..
- ఆత్మహత్యే శరణ్యం 22వ రోజుకు చేరిన గిరిజనుల దీక్ష
శంకర్పల్లి రూరల్, జూలై 6 : మా భూములు మాకివ్వండి.. లేకపోతే మాకు చావే శరణ్యమని శంకర్పల్లి మండలం మోకిలతండా గిరిజన రైతులు అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ.. గత 22 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయమని ఆవేదన చెందారు. తమ భూములు నగరానికి కూతవేటు దూరంలో ఉండి.. కోట్ల రూపాయలు ధర పలుకుతుండటంతో.. కొందరు రియల్ వ్యాపారులు తమ భూములపై కన్నెసి అధికారులతో కుమ్మక్కయ్యారన్నారు.
సర్వే నంబర్ లేని 32 ఎకరాల బిల్లా దాఖలా భూములకు సర్వే నంబర్లు సృష్టించి తమ భూములను లాక్కోవడంతో మా బతుకుదెరువు ఆగమ్యగోచరంగా ఉందని ఆవేదన చెందారు. గిరిజనులకు వ్యవసాయమే ప్రధాన ఆధారం.. తమకు వ్యవసాయం తప్ప మరే పని రాదని.. మమ్మల్ని ఉలా బతకమంటారో ప్రభుత్వమే చెప్పాలన్నారు. స్థానిక అధికారులు రియల్ వ్యాపారులతో కుమ్మకై తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. మాకు ప్రభుత్వం నుంచి న్యాయం జరగకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి.. న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- land
- Suicide
- tribals protest
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

