అనుసంధానిస్తే ఆనందమే..
మండల కేంద్రం నుంచి కర్ణాటక సరిహద్దు గ్రామం వరకు (రెండు కిలో మీటర్ల) రోడ్డు నిర్మాణాన్ని చేపడితే రెండు రాష్ర్టాల నడుమ రవాణా సౌకర్యం ఏర్పడుతుందని తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు.
- అంతర్రాష్ట రోడ్డు నిర్మాణంపై రెండు రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యం
బషీరాబాద్, నవంబర్ 25 : మండల కేంద్రం నుంచి కర్ణాటక సరిహద్దు గ్రామం వరకు (రెండు కిలో మీటర్ల) రోడ్డు నిర్మాణాన్ని చేపడితే రెండు రాష్ర్టాల నడుమ రవాణా సౌకర్యం ఏర్పడుతుందని తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువులు కొనేందుకు మండల కేంద్రం బషీరాబాద్తో పాటు తాండూరు పట్టణానికి వస్తుంటారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగే సంతకు వందల సంఖ్యలో ప్రజలు, వాహనాలు తిరుగుతుంటాయి. మట్టి రోడ్డును తారు రోడ్డుగా నిర్మించి అనుసంధానిస్తే రెండు రాష్ర్టాల ప్రజలు ఆనందిస్తారని పలువురు పేర్కొంటున్నారు.
రైతులకు, ప్రయాణికులకు మేలు..
మండల కేంద్రం నుంచి కర్ణాటక రాష్ట్రం హల్కోడ గ్రామం వరకు ఉన్న మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చడంతో రైతులకు, ప్రయాణికులకు మేలు జరుగుతుంది. రాష్ట్ర రైతులు, కర్ణాటకలో భూములు కొనుగోలు చేశారు. వీరు వ్యవసాయం చేసేందుకు ప్రతి రోజు మట్టి రోడ్డు పైనుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వ్యవసాయం చేసేందుకు ట్రాక్టర్లు, ప్రయాణికులు వచ్చి పోయేందుకు ప్రైవేట్ వాహనాలు మట్టి రోడ్డు పైనుంచే రాకపోకలు సాగించాలి.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో సంతోషం..
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేయడంతో తెలంగాణ రాష్ర్టానికి సరిహద్దున ఉన్న మాకు చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణకు సరిహద్దున ఉన్న మా గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయి. రోడ్లను నిర్మిస్తే రాకపోకలు సాగుతాయి. మా గ్రామ సరిహద్దు నుంచి ఉన్న మట్టి రోడ్డును అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
– రవిందర్‌రెడ్డి, హల్కోడ్ గ్రామం (కర్ణాటక)
తెలంగాణకు ఉపాధి కోసం వస్తాం..
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ, ఉపాధి కోసం ప్రతి రోజు వస్తుంటాను. తెలంగాణ రాష్ట్రంలోకి రావాలంటే రెండు కిలో మీటర్లు ఉన్న మట్టి రోడ్డు పైనుంచే రావాలి. ప్రభుత్వం పెద్ద మనుసు చేసుకొని మట్టి రోడ్డును తారు రోడ్డుగా నిర్మిస్తే రెండు రాష్ర్టాల ప్రజలకు, ప్రయాణికులకు ఎంతో మంచి జరుగుతుంది.
– రాజు, సులేపేట్ (కర్ణాటక)
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

