తుర్కయంజాల్ : ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి తుర్కయంజాల్ మున్సిపాలిటీ సిబ్బంది పడవను తయారుచేసి అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినయ్, ఎన్విరాల్మెంటల్ ఇంజినీర్ సురేష్, వార్డు అధికారి బాలరాజు మూడు రోజులు శ్రమించి ప్లాస్టిక్ వ్యర్థాలతో పడవ తయారు చేసి వినూత్న ఆవిష్కరణకు తెర తీశారు.
సుమారు 400 లకు పైగా ప్లాస్టిక్ బాటిల్లు, వెదురు కర్రలు, ట్యూబ్ లను ఉపయోగించి పడవను తయారు చేసినట్లు వినయ్ తెలిపారు. పరిశీలించిన అనంతరం తుర్కయంజాల్ మాసబ్ చెరువులో వినాయక నిమజ్జనాల కోసం ఈ పడవను ఉపయోగిస్తున్నట్లు వినయ్ తెలిపారు. సుమారు 200కిలో లకు పైగా బరువును ఈ పడవ మోస్తుందని వినయ్ తెలిపారు. పడవ తయారీలో మున్సిపాలిటీ సిబ్బంది సుధాకర్, అర్జున్, శివ తదితరులు సహకారమందించారు.