బడంగ్‌పేట, డిసెంబర్16: చోరీ జరిగిన 48 గంటల్లోనే మహేశ్వరం పోలీసులు దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఇన్స్పెక్టర్ మధుసూదన్ వివరాలను వెల్లడించారు. మహేశ్వరం మండలంలోని మన్ సాన్‌పల్లి గ్రామానికి చెందిన రాజు, ఆంజనేయులు ఇంటికి తాళం వేసి మూడు రోజుల కిందట బంధువుల ఇంటికి వెళ్లారు. ఇద్దరి ఇళ్లల్లో చోరీ జరిగింది.
ఉదయం గమనించిన స్థానికులు వెంటనే ఆంజనేయులు, రాజుకు సమాచారం ఇచ్చారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను గుర్తించారు. ఆకాన్‌పల్లి గ్రామంలో సాయికృప హచరీస్లో కార్మికులుగా పనిచేస్తున్న రవి, నాగరాజు, బాలును అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి రూ.1.50లక్షలు, 8తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ వెంకటయ్య, ఎస్ఐ నర్సయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.