చర్లపల్లి, మే 1 : వాతవరణం మార్పులపై నిరంతరం అధ్యయనం అవసరమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రుక్మిణీ పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్, చక్రీపురంలోని చక్రీ విద్యానికేతన్ స్కూల్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిబిరంలో ఆమె విద్యార్థులకు ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె టెలిస్కోప్ సహాయంతో విద్యార్థులకు సూర్యుని నిర్మాణం, రసాయన చర్యలు, సూర్యుడి విస్పోటనాలు, బ్లాక్ హోల్స్ ప్రభావం, అంతరిక్ష ఉపగ్రహాలపై దుష్పరిణామాలు వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. వాతవరణ మార్పులను అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకొవాలని ఆమె సూచించారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి పిట్టల నాగరాజు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు తోట శ్రీనివాస్, కోశాధికారి జెన్ని, నాయకులు దుర్గాచారి, శారద, శివశంకర్‌రెడ్డి, తహిర్, కేసీఆర్.దాస్లతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.