వికారాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) ; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయింది. సబ్బండ వర్ణా లను రేవంత్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గురుకుల పాఠశాలలపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. కేసీఆర్ హయాంలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందితే.. ప్రస్తుత సర్కారు తీసుకుంటున్న చర్యలతో అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల కిరాయిలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో అద్దె భవనాలకు ప్రతినెలా సక్రమంగా అద్దె చెల్లించడంతోపాటు.. విద్యార్థులకు మెస్‌చార్జీలు అందించి వారు బాగా చదువుకునేలా ప్రోత్సహించింది. గురుకుల పాఠశాలలు ఎలాంటి సమస్యల్లేకుండా కొనసాగితే మాజీ సీఎం కేసీఆర్‌కు మంచి పేరొస్తుందనే అక్కసుతోనే గురుకుల పాఠశాలలను మూసివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నాలుగు నెలలుగా అద్దె రావాల్సి ఉం డడంతో ఆ బకాయిల కోసం భవనాల యజమానులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 15 గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నా యి. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో నాలుగు గురుకుల పాఠశాలలుండగా.. వాటిలో ఎస్టీ గురుకులానికి సొంత భవనం ఉన్నది. బీసీ గురుకుల కా లేజీ గతంలో మొయినాబాద్‌లో ఉండగా దానిని స్థానికంగా అద్దె భవనంలోకి మా ర్చారు. ఆ భవనానికి నాలుగు నెలల అద్దె బకాయిలు రూ.4.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉన్నది. అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాల బొంరాస్ పేట మండలంలోని చిలుముల్ మైల్వార్‌లోని అద్దె భవనంలో కొనసాగుతున్నది. దానికి నెలకు రూ.లక్షా9 వేల చొప్పున గత నాలుగు నెలలకు రూ.4.36 లక్షలు, చేవెళ్ల మండలంలోని ముడిమ్యాలలో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలకు నెలకు రూ.4.51 లక్షల చొప్పున ఐదు నెలలకు రూ.22.55 లక్షల అద్దె బకాయిలు రావాల్సి ఉన్నాయి. పరిగిలో ఐదు గురుకుల పాఠశాలలున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలున్నాయి. బీసీ బాలుర, బాలికల భవనాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పరిగిలోని బీసీ బాలుర, బాలికల భవనాలకు సంబంధించి ఐదు నెలల అద్దె పెండింగ్‌లో ఉన్నది. బాలుర భవనానికి నెలకు అద్దె రూ.1.80 లక్షల చొప్పున ఐదు నెలలకు రూ.9 లక్షలు, అదేవిధంగా బాలికల భవనానికి నెలకు రూ.6.40 లక్షల చొప్పున ఐదు నెలలకు రూ.32 లక్షల అద్దె బకాయిలు రావాల్సి ఉన్నది.
తాండూరు సెగ్మెంట్, పెద్దేముల్ మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల అద్దె భవనంలో ఉన్నది. దాని అద్దె రూ.6 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మైనార్టీ గురుకుల పాఠశాలలు రెండు కొనసాగుతుండగా, ఈ రెం డు భవనాల్లో ఒక బిల్డింగ్‌కు ఏడాదిగా అద్దె పెండింగ్‌లో ఉంటే మరో భవనానికి నాలుగు నెలలుగా చెల్లించాల్సి ఉన్నది. శివారెడ్డిపేటలోని గురుకుల పాఠశాల అద్దె భవనానికి రూ.12 లక్షలు, మరో భవనానికి నాలుగు నెలల అద్దె బకాయిలు రూ.56 లక్షలు పెండింగ్‌లో ఉన్నట్లు భవనాల యజమానులు పేర్కొం టున్నారు. చేవెళ్ల మండలం, ధర్మసాగర్‌లోని బీఎస్‌ఐటీ కాలేజీలో వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఇంటర్మీడియెట్ గురుకుల కాలేజీ కొనసాగుతుం డగా రూ.30 లక్షల వరకు అద్దె బకాయిలున్నాయి. చేవెళ్లలోని సాగర్ ఇంజినీరింగ్ కాలేజీలో కొడంగల్ సెగ్మెంట్‌కు చెందిన బాలికల పాఠశాలతోపాటు వికారాబాద్, పరిగి, వికారాబాద్ బాలికల ఇంటర్మీడియెట్ గురుకుల కాలేజీలు నడుస్తున్నాయి. ఆ భవనానికి అద్దె దాదాపుగా రూ.31.40 లక్షల వరకు రావాల్సి ఉన్నది.
ఎనుకటి రోజులు మళ్లీ వస్తున్నాయి..
బీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు రాష్ట్రంలో 50 గురుకుల పాఠశాలలున్నాయి. కేసీఆర్ 1,100 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించారు. పదేండ్ల కాలంలో గురుకుల పాఠశాలల విద్యా ర్థులు ధర్నాలు చేసిన దాఖలాల్లేవు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల కాలంలోనే గురుకులాలలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థులకు వసతు లను సక్రమంగా కల్పించకపోవడంతో వారు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రంలో ఎనుకటి రోజులు మళ్లీ వస్తున్నాయి. రేవంత్ పాలనను చూసి ప్రజలు చీదరించుకుంటు న్నారు.
-నాగేందర్‌గౌడ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్