Crime News | మొయినాబాద్, ఫిబ్రవరి13: బంధువుల ఇంట్లో పెండ్లి ఉండటంతో ఊరికెళ్లి వచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు. ఇంట్లో దాచి పెట్టిన బంగారం, నగదు గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మున్సిపాలిటి పరిదిలోని పెద్దమంగళారం గ్రామ నివాసి మాజీ సైనికుడు బొలించెరువు కృష్ణారెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.
కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో తమ బందువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. పెండ్లు ముగించుకుని గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి చేరుకుని తాళం తీయడానికి ప్రయత్నిస్తుండగా అప్పటికే తలుపు గడియ రాడ్ యాక్సాప్ బ్లేడ్‌తో కట్ చేసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసే పరికి బీరువా తాళం పగులగొట్టి అందులో ఉన్న ఎనిమిది తులాల బంగారం, రూ. లక్ష నగదు అపహరించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కుటుంబ సబ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాని పోలీసులు తెలిపారు.