షాద్‌నగర్, జూలై 17 : సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న యువ సంగ్రామ సద స్సును విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చడంలేదని ఆయన విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పిలుపు మేరకు శుక్రవారం షాద్‌నగర్‌కు యువత పెద్ద సం ఖ్యలో తరలివచ్చి గోడ పత్రికను విడుదల చేశారు.