ధారూరు, డిసెంబర్ 4: యువకుడు అదృశ్యం అయిన ఘటన అవుసుపల్లి లో జరిగింది. ఆదివారం స్థానికు లు, బంధువు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధారూరు మండల పరిధిలోని అవుసుపల్లి గ్రామానికి చెందిన కొడిగంటి రాములు కుమారుడు కొడిగంటి దేవేందర్(26) రెండు నెలల నుంచి కనబడుటలేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లిలో టైల్స్ పనికి మిట్టకొడి శ్రీనివాస్ అనే వ్యక్తి తీసుకుపోయాడని తెలిపారు.
అక్కడ మూడు రోజులు కలిసి పని చేసుకుంటూ ఒకే రూంలోఉన్నారు. ఒక రోజు రాత్రిపూట తిరుగుతుండగా చందానగర్ పోలీసులు రాత్రి పోలీస్ స్టేషన్లో ఉంచుకొని ఉదయానే వదిలివేసినట్టు తెలిపారు. మరుసటి రోజు నుంచి కనబడటం లేదని చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నా రు. ఆచూకీ తెలిసిన వారు 8074885190, 9177679562 9440627 254 లను సంప్రదించగలరని కోరారు.