తాండూరు, ఫిబ్రవరి 6: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం తాండూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దే ముల్ మండలాల్లో సోమవారం విజయవంతంగా కొన సాగింది. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలకు విశేష స్పందన లభిస్తున్నది. కంటి పరీక్షలు చేయించుకున్న ప్రజలకు అవసరాన్ని బట్టి ఉచితంగా అద్దాలు, మందుల పంపిణీ చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులతో పాటు స్థానిక నేతలు, అధికారులు కంటి చికిత్స కేంద్రాలను సందర్శించి సౌకర్యాలు తెలుసుకుంటున్నారు. ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ మేనేజర్ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా కంటి చికిత్సలు నిర్వహించడం అభినం దనీయమని కౌన్సిలర్ సోమశేఖర్ పేర్కొన్నారు.