షాద్నగర్టౌన్ : పహల్గాం ఉగ్రదాడికి పత్రీకారంగా మన దేశం ఆపరేషన్ సింధూర్ ( Operation Sindoor ) పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసిందని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్ ( Former MLA Anjaiah Yadav) అన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశానికే గర్వకారణమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మన దేశ అమాయక ప్రజలు మృతి చెందడంతో ప్రజలు కన్నీరు పెట్టిందని గుర్తు చేశారు.
దేశ ఆర్మీ జవాన్లు ఉగ్రవాదుల నిర్మూలననే లక్ష్యంగా ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ దాడులను చూసి దేశ ప్రజలు సంతోషిస్తున్నారన్నారు. మన దేశం వైపు చూడాలంటనే భయపడే విధంగా పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశ భద్రతలో సైనికుల పాత్ర మరువలేనిదన్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన దాడులతో ఉగ్రవాదం పూర్థిస్థాయిలో కనుమరుగుకావాలని ఆకాక్షించారు.