చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రోడ్ షో జనసంద్రమైంది. గులాబీ శ్రేణులతోపాటు స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ప్రాంతమంతా గులాబీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో గులాబీ తోటలా మారింది. ఇసుకపోస్తే రాలనంత జనం రావడంతో జాతరను తలపించింది.

మంత్రి కేటీఆర్ మాట్లాడినంత సేపు జనం శ్రద్ధగా విన్నారు. గులాబీ దళం చేసిన కేరింతలు, ఈలలు, నినాదాలతో అక్కడి ప్రాంతమంతా దద్దరిల్లింది. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు మ్యానిఫెస్టోను వివరించారు.

కళాకారుల ఆటపాటలు ఉర్రుతలూగించాయి. గులాబీ జెండలమ్మ రామక్క.. పాటతో మహిళలు చేసిన డ్యాన్స్‌తో అక్కడున్నవారిలో జోష్‌ను పెంచింది. కారుగుర్తుకే మన ఓటు.. కాలె యాదయ్య గెలుపు ఖాయం.. ప్రతిపక్షాలు మాయం అన్న నినాదాలు మార్మోగాయి.


