పరిగి, అక్టోబర్ 2 : వికారాబాద్ జిల్లాను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)గా ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం నిర్ణయించిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. పరిగి నియోజకవర్గాన్ని యూడీ అథారిటీగా ఏర్పా టు చేయాలని తాను సీఎం దృష్టికి తీసుకువెళ్లానని, కాగా జిల్లా అంతటినీ అథారిటీగా చేద్దామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారన్నారు.
ఈ అథారిటీ ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కేంద్రం వాటా నిధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. బుధవా రం గాంధీ జయంతి సందర్భంగా పరిగిలోని గాంధీ విగ్రహానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. అలాగే లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేవీ రాడార్ ప్రాజెక్టు రావడంతో అల్ట్రా మోడల్ హాస్పిటల్ ఏర్పాటు జరుగుతుందని, ఐసీయూకు సంబంధించిన కొన్ని పరీక్షలు అక్కడ చేస్తారని, ఈ ప్రాంతం వారికి అక్కడ అపరేషన్లు చేయించవచ్చని తెలిపారు. ఈ నెల 15న నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం ఏర్పాటులో 899 చెట్లే కోల్పోవడం జరుగుతుందని.. తక్కువ రేడియేషన్‌తో నేవీ రాడార్ స్టేషన్ పనిచేస్తుందన్నారు. 1500 ఎకరాల్లో చెట్లు పెంచే కార్యక్రమం ఉం టుందన్నారు.
ఇది ప్రధానమంత్రి కంట్రోల్లో ఉండే సీ క్రెట్ ప్రాజెక్టు అని తెలిపారు. అనంతరం వారం పది రో జుల తర్వాత అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రూ.800 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.3500 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని. పరిగి, దోమ మండలాల మీదుగా రైల్వేలైన్ వెళ్తుందన్నారు. నారాయణపేట్ ప్రాంతంలో గూడ్స్ రైళ్లు నడపడం ద్వారా వ్యాపారం జోరుగా సాగుతుందన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్క రైల్వే స్టేషన్ తీసివేయబడదని, కొత్తగా చేర్చబడుతుందని చెప్పారు.
రూ.100 కోట్ల కేటాయింపునకు నివేదిక
పరిగి నియోజకవర్గానికి పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీకి సంబంధించి రూ.100 కోట్లు కేటాయించేందుకు సీఎంకు నివేదిక అందజేశామన్నారు. పరిగి మున్సిపాలిటీకి రూ.40 కోట్లు మంజూరు చేయిస్తామని, రూ.5కోట్లతో మున్సిపల్ కార్యాలయం, వార్డు కార్యాలయాలు, కొత్త ట్యాంకులు, వాటర్ కనెక్షన్లు, సీసీ రోడ్లు నిర్మాణం చేస్తామన్నారు. పరిగి నియోజకవర్గానికి రీజినల్ రింగ్ రోడ్డు రానుందని తెలిపారు. జిల్లాలోనే మొదట సోలార్ పవర్, విండ్ పవర్ జనరేషన్ ఇక్కడే జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, మాజీ సర్పంచ్ సిద్ధాంతి పార్థసారథి, వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.