షాద్‌నగర్‌రూరల్, మార్చి 1 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో నాడు నాటిన మొక్కలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. ప్రతి ఇంటి ఎదుట పెరిగిన మొక్కలు, రోడ్డుకు ఇరువైపులా చెట్లు, పల్లె ప్రకృతివనంతో ఫరూఖ్‌నగర్ మండలంలోని హాజిపల్లి సరికొత్త శోభను సంతరించుకున్నది. షాద్నగర్మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో ఉన్న హాజిపల్లి రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకోవడంతోపాటు.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మల్ పురస్కార్ అవార్డును కూడా అందుకున్నది.
గ్రామంలో 242 కుటుంబాలున్నాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించారు. దీంతో ప్రతి ఇంటి ఎదుట 5 మొక్కలు, రోడ్డు ఇరువైపులా, పల్లె ప్రకృతివనంలో 1500 మొక్కలు నాటారు. ఇందులో జామ, నేరేడు, ఉసిరి, గన్నేరు, బొప్పాయి లాంటి చెట్లు ఉన్నాయి. ఇవి నేడు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాల అలరారుతున్నది.
– మశ్చేందర్, హాజిపల్లి
మా గ్రామం పచ్చదనంతో కళకళలాడుతున్నది. శుభ్రతకు మారుపేరుగా నిలువడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలను కాపాడుతున్నారు.
ఆహ్లాదకర వాతావరణం నెలకొంది : విష్ణు, హాజిపల్లి
గ్రామంలో పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. గ్రామంలోని సర్కార్ పాఠశాల కళకళలాడుతున్నది. మొక్కలు నాటడంతో ఆరోగ్య జీవనం కొనసాగిస్తున్నాం.
అనునిత్యం మొక్కలకు నీళ్లు పోస్తున్నాం : మౌనిక, సర్పంచ్, హాజిపల్లి
ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. నాడు నాటిన ప్రతి మెక్కను కాపాడాం. అనునిత్యం మొక్కలకు నీరు అందిస్తున్నాం. నాడు నాటిన మొక్కలు నేడు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా.