సిటీ బ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యా న్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభు త్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించిం ది. అన్ని ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే కాలుష్య నియంత్రణ మండలి ప్రజా సంక్షేమానికి ముఖ్యమైనది. బోర్డు నిర్వహణ, బాధ్యతలు అత్యంత కీలకం కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి కాలుష్య నియంత్రణ మండలిని పట్టించుకునే వారే కరువయ్యారు.
పీసీబీకి ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. పీసీబీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుం ది. ఆ శాఖ బాధ్యతలు మంత్రి కొండా సురేఖ నిర్వర్తిస్తున్నారు. అయితే రెండేండ్లలో పీసీబీపై ఆమె ఏమాత్రం పట్టుసాధించలేకపోయిందనే విమర్శలున్నాయి. మంత్రికి అవగాహన లేకపోవడం, చైర్మన్ గాలికొదిలేయడం తో పీసీబీ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పీసీబీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రామకృష్ణారావు కనీసం ఒక్కసారి కూడా బోర్డు మీ టింగ్ నిర్వహించలేదని తెలుస్తున్నది.
అసలు ఆ సంస్థకు తాను చైర్మన్ అని రామృకృష్ణారా వు, పర్యావరణ మంత్రి కొండా సురేఖ మర్చిపోయినట్లున్నారని ప్రజలు, పర్యావరణ ప్రే మికులు విమర్శలు చేస్తున్నారు. పర్యావరణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ల లో 2023 డిసెంబర్ 17న మంత్రి సురేఖ కా లుష్య నియంత్రణ మండలి సందర్శించారు. ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరోసారి విజిట్ చేసి మమా అనిపించారు. అప్పటి నుంచి కాలుష్య నియంత్రణ మండలిలో ఆమె అడుగే పెట్టలేదు.
అధికారుల ఇష్టారాజ్యం..
మంత్రి, చైర్మన్ పట్టించుకోకపోవడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇష్టారాజ్యంగా