గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు వలసలు వెళ్లకుండా నిరోధించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీ మ్ కింద కనీసం వంద రోజులు కూలీలకు ఉపాధి కల్పిస్తారు. అలాగే, జాబ్‌కార్డు కలిగి ఉండి 20 రోజులు పనిచేసిన వారికి ఏడాదికి రూ.12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. అయితే, మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమల్లో లేకపోవడంతో అక్కడ జీవిస్తున్న కూలీ లు పనులకు దూరం కావడమే కాకుండా ఆత్మీయ భరోసాకూ నోచుకోవడంలే దు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొత్తూరు, ఆమనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల, మొయినాబాద్ తదితర మున్సిపాలిటీ ల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోవడంతో పనిలేక ఇబ్బంది పడుతున్నామని.. ప్రభుత్వం స్పం దించి తమకు పని కల్పించాలని కూలీ లు, ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో సగానికి పైగా పట్టణ ప్రాంతాలుండడంతో అవి మున్సిపాలిటీలుగా అవతరించా యి. ఇబ్రహీంపట్నం, కొత్తూరు, ఆమనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల, మొయినాబాద్ తదితర మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రా మాల్లో ఉపాధి హామీ పథకం అమల్లో లేకపోవడంతో అక్కడ జీవిస్తున్న కూలీలు పనులు దొరక్క, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులు కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో గతంలో 14 మున్సిపాలిటీలుండగా.. కొత్తగా చేవెళ్ల, మొయినాబాద్లను కూడా పురపాలికలుగా ప్రభుత్వం ప్రకటించడంతో వాటి సంఖ్య 16కు చేరింది. అదే విధంగా 21 మండలాలుండగా, అందులో సగం వరకు మున్సిపాలిటీల పరిధి విస్తరించి ఉన్నది. దీంతో గ్రామీణ ప్రాంతాలూ మున్సిపాలిటీలుగా అవతరించడంతో వాటిని కూడా పట్టణ ప్రాంతాలుగానే పరిగణిస్తున్నారు. అలాగే, ప్రస్తుతం జిల్లాలో 2 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలోనూ ఉపాధి హామీ పథకం నిలిచిపోయింది. కొత్తగా మరో 20 గ్రామపంచాయతీలను కలుపుతూ.. ఫ్యూచర్‌సిటీ కా ర్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ కార్పొరేషన్ ఏర్పాటైతే మరో 20 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిలిచిపోనున్నది. జిల్లాలో 549 గ్రామ పంచాయతీలుండగా ఇటీవల మరో 30 పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో చేరిపోయా యి. ఈ గ్రామాల్లోని కూలీలు ఉపాధి హామీ పనులతోపాటు ఆత్మీయ భరోసా పథకానికి దూరం కానున్నారు. ఇటీవల మున్సిపాలిటీల్లోనూ పేదలున్నారని.. వారికీ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
జిల్లాలో ఉన్న 16 మున్సిపాలిటీల్లో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాలు కలిసినవే. ఆమనగల్లు, షాద్‌నగర్, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, మొయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలు గ్రా మీణ ప్రాంతాలతో విలీనమై ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సీతారాంపేట, శేరిగూడ, ఖానాపూర్.. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో కొహెడ, బ్రాహ్మణపల్లి, మన్నెగూడ.. ఆదిబట్ల మున్సిపాలిటీలో మంగల్‌పల్లి, కొంగర, పటేల్‌గూడ, రాందాస్‌పల్లి, బొంగ్లూరు వంటి గ్రామాలు ండగా వాటిని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమల్లో లేదు. అలాగే, కొత్తూరు, చేవెళ్ల, మొయినాబాద్, షాద్‌నగర్ వంటి మున్సిపాలిటీలను చుట్టూ ఉన్న గ్రామాలతోనే పురపాలికలుగా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఊర్లలోనూ ఉపాధి హామీ పథకం కొనసాగడం లేదు. దీంతో పలు గ్రామాల ప్రజలు తమను మున్సిపాలిటీల్లో కలిపినందుకు సంతోషపడాలా.. ఉపాధి హామీ పథ కాన్ని కోల్పోయినందుకు బాధ పడాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీల్లో చుట్టూ ఉన్న గ్రామాలను విలీనం చేశా రు. ఆ గ్రామా ల్లో నూ ఎంతోమంది కూలీలు ఉన్నారు. వారికి ఉపాధి హామీ పథకం వర్తించడంలేదు. వారికి పనులు దొరకని పరిస్థితి నెలకొన్నది. అలాగే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకూ దూరమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి మున్సిపాలిటీల పరిధిలోని గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి వారికి పని కల్పించాలి.
ఎవరన్నా వ్యవసాయ పనులకు పిలుస్తారనుకుంటే పంటలు పండడం లేదు. నీళ్లులేక బోరుబావు లు ఎండిపోయి పొ లాలు పడావుగా మారాయి. మున్సిపాలిటీలో మా గ్రామాన్ని కలపడంతో ఉపాధి హామీ పనిని అధికా రులు బంద్ చేశారు. ఉపాధి పని ఉన్నప్పుడు నాలుగు రూపాలు వస్తుం డే. కాయకష్టం చేసుకుని బతికే నాలాంటి పేదలకోసం సర్కారు ఉపాధి హామీ పనిని కల్పించాలి.