నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి
నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, గ్రామాలు, తండాల్లో అన్ని రకాల సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు.
- ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
- రేఖ్యాతండాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కడ్తాల్, ఫిబ్రవరి 7 : నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, గ్రామాలు, తండాల్లో అన్ని రకాల సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రేఖ్యాతండా గ్రామ పంచాయతీలో రూ.20 లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనం, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు, తండాల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. తండాలను ప్రత్యేక జీపీలుగా మార్చిన సీఎం కేసీఆర్‌కు గిరిజనులందరూ రుణపడి ఉంటారని తెలిపారు. అదే విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలకు కొత్త శోభ వచ్చిందని చెప్పారు. అనంతరం కడ్తాల్ గ్రామానికి చెందిన సాయికి రూ.28 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్ హరిచంద్‌నాయక్, సులోచన, ఎంపీటీసీ మంజుల, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహాగౌడ్, ఉప సర్పంచ్‌లు రామకృష్ణ, గణేశ్, జగన్, ముత్యాలు, సాయిలు, చంద్రమౌళి, రాములునాయక్, రాజేందర్‌యాదవ్, కోట్యా, కృష్ణ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మాడ్గుల : మండలంలోని దొడ్లపాడ్ గ్రామానికి చెందిన అలివేలుకు రూ. 24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును మంగళవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు భూపతిరెడ్డి, తిరుపతి, శ్రీను, పాషా, తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ వినతి
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ప్రభుత్వ స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను ఆమనగల్లు బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ శర్మ, ఉపాధ్యక్షులు మల్లేపల్లి జగన్, యాదిలాల్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, న్యాయవాదులు రామకృష్ణ, శేఖర్, మల్లేశ్, మధు, కృష్ణ, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

