బొంరాస్‌పేట, జూలై 21 : చదువుకోవాలనే కోరిక ఉన్న వారి ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ స్కూల్(దూర విద్యా విధానం) ద్వారా విద్యావకాశాన్ని కల్పిస్తున్నది. రెగ్యులర్‌గా బడికెళ్లని వారికి.. పది, ఇంటర్ వరకు వివిధ కారణాలతో చదువు కొనసాగించలేని వారికోసం ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా బాలికలు, మహిళలు, గ్రామీణ యువత, పనులు చేసుకునే మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, ఇతరులకు విద్య అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఓపెన్ స్కూల్ లో పదోతరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి ఇచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్‌గా చదివి పాసైన వారికిచ్చే సర్టిఫికెట్లతో సమాన ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. 2023-24 విద్యా సంవత్సరానికి ఓపెన్ పది, ఇంటర్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఓపెన్‌లో టెన్త్, ఇంటర్ చదువాలనుకునే వారు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సెస్సీకి రూ.100జరిమానాతో, ఇంటర్లో రూ.200 ఫైన్‌తో ఆగస్టు 31 నాటికి ప్రవేశం పొందొచ్చు.
అందరికీ అందరికీ విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 2008-2009 సంవత్సరం నుంచి దూర విద్యా విధానం ద్వారా పదోతరగతి కోర్సును ప్రారంభించింది. 2010-2011 నుంచి ఇంటర్ కోర్సును ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అధీనం లో ఉండే అధ్యయన కేంద్రాల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఓపెన్ పది, ఇంటర్లో సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో ఫీజు చెల్లించి ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందొచ్చు.వయో పరిమితి, అర్హతలు ఓపెన్ స్కూల్లో చేరే వారికి గరిష్ఠ వయో పరిమితి లేదు. పదిలో ప్రవేశానికి 2023 ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి. ఇంటర్లో ప్రవేశానికి 2023 ఆగస్టు 31 నాటికి 16 ఏండ్లు నిండి ఉండాలి. చదువు మధ్యలో మానేసిన వారు, చదువుకు దూరమైన వారు పదో తరగతిలో, ఎస్సెస్సీ పూర్తయిన వారు ఇంటర్లో ప్రవేశం పొందొచ్చు.
టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందిన వారు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ మాధ్యమా ల్లో ఏదైనా ఒక దానిని ఎంచుకోవాలి. అధ్యయన కేంద్రాల్లో ప్రతి ఆదివారం జరుగనున్న తరగతులకు హాజరు కావాలి. ప్రవేశం పొందిన వారికి అవసరమైన పుస్తకాలను కూడా ప్రభుత్వమే అందజేస్తుంది. టెన్త్, ఇంటర్‌ను ఒకే ఏడాదిలో పూర్తి చేయొచ్చు. అందులో ఐదు సబ్జెక్టులు ఉంటాయి.
టెన్త్‌లో ప్రవేశానికి రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజుగా ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు, దివ్యాంగులు, మాజీ సైనికుల పిల్లలకు అడ్మిష న్ ఫీజు రూ.1000.. ఓపెన్ కేటగిరీ వారికి రూ. 1400 ఉంటుంది. ఇంటర్ కోర్సులో చేరే వారికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300. అడ్మిషన్ ఫీజు ఓపెన్ కేటగిరీ వారికి రూ.1500, మిగతా వారికి రూ. 1200 ఉంటుంది. రెగ్యులర్ కళాశాలల్లో లక్షల ఫీజులు చెల్లించి ఇంటర్ చదివే బదులు ఏడాదిలో కేవలం రూ.3 వేలు చెల్లించి ఇంటర్ కోర్సును దూర విద్యలో పూర్తి చేయొచ్చు.
ఆర్థిక స్థోమత లేని వారికి, కూలీనాలి చేసుకునే వారికి ఓపెన్ స్కూల్ మం చి అవకాశం. పేద విద్యార్థులు ఈ విధానంలో పది, ఇంటర్, పీజీ చదవి ఉపాధితోపాటు ఉద్యోగ అవకాశాలను పొందొచ్చు. రెగ్యులర్ కోర్సులకు సమానంగా ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లకు ప్రాధాన్యత ఉంటుంది. రెగ్యులర్‌గా బడికి, కళాశాలలకు వెళ్లని వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. దళారులను నమ్మకుండా రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావాలి. -సత్యనారాయణ, ఓపెన్ స్కూల్ వికారాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ వికారాబాద్ జిల్లాలో 20 అధ్యయన కేంద్రాలు వికారాబాద్ జిల్లాలో 20 అధ్యయన కేంద్రాలున్నా యి. అభ్యర్థులు ఏ అధ్యయన కేంద్రంలో అడ్మిషన్ తీసుకుంటే ఆ కేంద్రంలో తరగతులకు హాజరుకావాలి. అధ్యయన కేంద్రాల వివరాలు మర్పల్లి, మోమిన్‌పేట, నవాబుపేట, వికారాబాద్(బాలుర ఉన్నత పాఠశాల), మన్నెగూడ, జడ్పీహెచ్ఎస్ పరి గి నం.2, జడ్పీహెచ్ఎస్ పరిగి నం.1, జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల కులకచర్ల, దోమ బా లుర ఉన్నత పాఠశాల, దాదాపూర్, ధారూర్ బా లుర ఉన్నత పాఠశాల, జడ్పీహెచ్ఎస్ నాగారం, జడ్పీహెచ్ఎస్ బంటారం, జడ్పీహెచ్ఎస్ పెద్దేముల్, తాండూరు నం.1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తాం డూరు చైతన్య జూనియర్ కళాశాల, బాలుర ఉన్నత పాఠశాల బషీరాబాద్, ఉన్నత పాఠశాల యాలాల, బాలుర ఉన్నత పాఠశాల కొడంగల్, ఉన్నత పాఠశాల దౌల్తాబాద్.