పైలెట్ రోహిత్‌రెడ్డికి ముందస్తు బెయిల్
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తాండూరులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పైలెట్ రోహిత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మరోఎనిమిది మందిపై తాండూరు పోలీసులు ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
- అక్రమ కేసును కొట్టేయాలని హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు
తాండూరు, ఫిబ్రవరి 20 : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తాండూరులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పైలెట్ రోహిత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మరోఎనిమిది మందిపై తాండూరు పోలీసులు ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
తనపై, తన అనుచరులపై రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ కేసులు నమోదయ్యాయని.. వాటిని కొట్టేయడంతోపాటు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రోహిత్‌రెడ్డి రాష్ట్ర హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేయగా.. పరిశీలించిన న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా, మాజీ ఎమ్మెల్యేపై పెట్టిన కేసు విచారణ వారం రోజుల తర్వాత జరిగే అవకాశం ఉన్నది. రోహిత్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి శ్రీశైల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

