కడ్తాల్, అక్టోబర్ 25 : మండలంలో ఇండ్లు లేని నిరుపేదలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు తరఫున ఇండ్లు నిర్మించి ఇస్తామని కడ్తాల్ జడ్పీటీసీ, ట్రస్టు చైర్మన్ దశరథ్‌నాయక్ అన్నారు. మండలంలో రాధాకృష్ట మెమోరియల్ చారిటబుల్ ట్రస్టుని స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో భర్తని కోల్పోయి ఇద్దరు చిన్నారులతో పూరి గుడిసెలో నివాసముంటున్న శేడల యాదమ్మకు ఇంటిని నిర్మించేందుకు వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు తరఫున అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో ట్రస్టు తరఫున పేదలు, ప్రైవేట్ డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం, మెడికల్ కిట్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. మండలంలో వివిధ కారణాలతో చనిపోయిన కుటుంబాలకు రూ.5 వేల చొప్పున అందజేస్తున్నామన్నారు. ముద్విన్ గ్రామంలో యాదమ్మకి సంక్రాంతిలోగా ఇంటిని నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చును మొత్తం భరిస్తానన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, రైతుబంధు సమితి మండల, గ్రామాధ్యక్షులు వీరయ్య, నర్సింహ, బాలకృష్ణ, జంగయ్య, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, యాదయ్య, కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, రవీందర్‌రెడ్డి, భారతమ్మ, సులోచన, కమ్లీ, భాగ్యమ్మ, లోకేశ్‌నాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, మంజుల, ప్రియ, ఉప సర్పంచ్‌లు వినోద్, శారద, వెంకటేశ్, ముత్యాలు, శ్రీనూనాయక్, నరేశ్, నర్సింహ, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల యూత్ వింగ్ అధ్యక్షుడు ఇర్షాద్, గ్రామాధ్యక్షులు రాజాగౌడ్ పాల్గొన్నారు.