రంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మల్లేశ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించాలని.. పార్టీపరంగా వద్దే..వద్దు అని శుక్రవారం రంగారెడ్డిజిల్లా పంచాయతీ అధికారికి ఆయన వినతిపత్రం అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పి ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని మాట మార్చడం తగదన్నారు. ప్రభు త్వం బీసీలను నమ్మించి మోసం చేస్తున్నదని మండిపడ్డారు.కార్యక్రమంలో బీసీ సం ఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, కురుమ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ముదిరాజ్‌సంఘం అధ్యక్షులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.