తాండూరు, ఆగస్టు 8 : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరులోని రాజీవ్ కాలనీతోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనంపచ్చదనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం స్థానిక నేతలు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 10వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు నీరజ, ప్రభాకర్‌గౌడ్, నాయకుడు రవూఫ్ ఉన్నారు.
పరిగి : వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పేర్కొన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పరిగి మున్సిపల్ పరిధిలోని న్యామత్‌నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రత, మొక్కల పెంపకం అంశాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు గురువారం మున్సిపల్ చైర్మన్ అశోక్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, కౌన్సిలర్లు రవీంద్ర, వెంకటేశ్, కృష్ణ, నాయకులు మీర్ తాహెర్‌అలీ, ఇన్చార్జి వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, వైద్య శాఖ ఉద్యోగి వెంకన్న, మెప్మా సీవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
పెద్దేముల్ : గొట్లపల్లి మోడల్ స్కూల్ మైదానంలో సుమారు 5 వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు చేపట్టాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని గొట్లపల్లి, గిర్మాపూర్ గ్రామాల్లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గొట్లపల్లి మోడల్ స్కూల్లో విశాలమైన మైదానం ఉన్నందున సుమారు 5 వేల మొక్కలను నాటి వాటిని సంరక్షించేలా మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, ఏపీవో నర్సింహులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆగస్టు 8, 2025 వరకు మొత్తం 5వేల మొక్కలు సంరక్షించబడి ఉండాలని, మళ్లీ అదే రోజు మొక్కలు నాటుతానని తెలిపారు.
మొదటి దఫాలో 40 నుంచి 45 పాఠశాలలు ఏర్పాటు కానుండటంతో తాండూరులోని యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో ఓ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయిస్తామని, అందుకు సంబంధించి ఇప్పటికే స్థల పరిశీలన కూడా జరిగిందన్నారు. అదేవిధంగా రూ.10 కోట్లతో ఓ స్టేడియం కూడా నిర్మిస్తామన్నారు. గొట్లపల్లి మోడల్ స్కూల్లో ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న హాస్టల్ భవనాన్ని కూడా నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బుచ్చిబాబు, ఎమ్మార్వో కిషన్, ఎంపీడీవో జర్నప్ప, నాయకులు ధారాసింగ్, నారాయణ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ గాయత్రి, పీఈటీ ప్రశాంత్‌రెడ్డి, ఏపీవో నర్సింహులు, ఈసీ కృష్ణ, ఎంపీవో రతన్‌సింగ్, విద్యార్థులున్నారు.
ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని తాండూరు మైన్స్ ఏడీ, మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ అన్నారు. మండల ఏపీవో నర్సింహులు, ఈజీఎస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో మండల ఏపీవో నర్సింహులు, నాయకుడు రాంరెడ్డి, ఈసీ కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్లు వెంకటయ్య, సురేశ్, నవీన్, గోపాల్, కృష్ణ, పంచాయతీ కార్యదర్శి చంద్రప్ప పాల్గొన్నారు.
తాండూరు రూరల్ : తాండూరు మండలం అంతారం అర్బన్ పార్క్ ఎదుట స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అర్బన్ పార్క్ వివరాలను ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రభాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎల్మకన్నె పీఏసీఎస్ చైర్మన్ రవీందర్‌గౌడ్, ఎంపీడీవో విశ్వప్రసాద్, తహసీల్దార్ తారాసింగ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.