పెద్దేముల్ : మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులోని చిన్న పానాది ప్రధాన రోడ్డు గుండా పొలాలకు వెళ్లడానికి నూతనంగా ఓ ఫార్మేషన్ రోడ్డును మంజూరు చేయాలని మారేపల్లి సర్పంచ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్రెడ్డి ఆధ్వర్యంలో మారేపల్లి గ్రామ రైతులు జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. చాలా ఏండ్ల నుంచి చిన్న పానాది గుండా పొలాలకు వెళ్లే దారి సరిగా లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అందుకు నూతనంగా ఓ ఫార్మేషన్ రోడ్డును మంజూరు చేసి రైతుల ఇబ్బందులను తీర్చాలని పలువురు రైతులు సునీతారెడ్డిని కోరారు. అందుకు స్పందించిన ఆమె త్వరలో ఫార్మేషన్ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామంలో మాజీ ఎంపీటీసీ రాములు మనవరాలు శుభకార్యంలో పెద్ద కుర్వ అంజప్ప కుమారుని వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించారు. పలువురు సునీతారెడ్డికి సన్మానం చేశారు. ఆమె వెంట మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్రెడ్డి, నాయకులు అనంతయ్య, గ్రామ రైతులు ఉన్నారు.