తాండూరు, ఫిబ్రవరి 6: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరు క్యాంపు కార్యాలయంలో యాలాల మండలానికి సంబందించిన 57 మంది లబ్ధిదారులకు రూ. 57,06,612 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో, విద్యాలయాల్లో కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పించి మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తాండూరుకు సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామ న్నారు. ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ ద్వార తాండూరు నియోజకవర్గానికి రూ.13 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
ఎన్నికల్లో ఇచ్చినమాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదా రులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలు అమలు చేశామని, వచ్చేనెల మార్చి ఒకటో తేదీ నుంచి రూ.500 కే గ్యాస్ సిలిండర్, అర్హులైన ప్రతి లబ్ధిదారులకు 200 యూనిట్ల కరెంట్‌ను ఉచితంగా అందించనున్నామన్నారు. ఇండ్లులేని వారికి రూ.5 లక్షలు, అర్హులైన ప్రతిమహిళకు నెలకు రూ.2500 కూడా త్వరలో అమలు చేయనున్నామన్నారు. త్వరలో మెగాడీ ఎస్సీ, 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయన్నారు. మార్చిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో భాగంగా రూ.1,00,116 తోపాటు, తులం బంగారం కూడా ఇవ్వనున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, వైస్‌ఎంపీపీ మధులత, జడ్పీటీసీ ధారాసింగ్, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ము మాణెమ్మ, ఎంపీటీసీలు లొంకనీలు, శంకర్, మండల కోఆప్షన్ సభ్యుడు నసీరోద్దీన్, నాయకులు మహిపాల్‌రెడ్డి,జితేందర్‌రెడ్డి, గోపాల్, శోభమ్మ, లొంకనర్సింహులు, డీవై నర్సింహులు, రియాజ్, మైఫూజ్, లాల్‌రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఆనందంచారి, పెండ్యాల ప్రవీణ్కుమార్గుప్తా, తహసీల్దార్ కె. కిషన్, ఆర్ఐరాజురెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వేణు, జూనియర్ అసిస్టెంట్లు అవినాశ్ ,మహేశ్, రమేశ్పాల్గొన్నారు.