తాండూరు, అక్టోబర్ 1: స్వచ్ఛత-హీ-సేవా కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గంలో ఆదివారం కాలుష్య రహిత సమాజం కావాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. తాండూరు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్ర త్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అన్నారు. చెత్తరహిత పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రాణాంతకరమైన ప్లాస్టిక్‌ను ఎవరూ వాడరాదని సూచించారు. అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షఫీఉల్లా, మేనేజర్ నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: మెట్లకుంటలో నిర్వహించిన సమావేశంలో డీఎల్పీవో శంకర్‌నాయక్, ఎంపీవో పాండు పాల్గొని ప్రజలకు పారిశుధ్యం, పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలతో పాటు వీధులు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ, కార్యదర్శి సిద్ధు పాల్గొన్నారు.
కొడంగల్: మండలంలోని హస్నాబాద్‌లో సర్పంచ్ ఫకీరప్ప, పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని గాంధీ విగ్రహ కూడలిలో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కులకచర్ల : కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లోని గ్రామ గ్రామాన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. ఆయా గ్రామాల్లో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.
వికారాబాద్ : పట్టణంలోని పలు వార్డుల్లో స్వచ్ఛతా-హీ-సేవా కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు ఆదివారం నిర్వహించారు. వార్డుల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
బంట్వారం: మనం నివసించే ప్రతి వీధిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సర్పంచ్ లావణ్య పేర్కొన్నారు. ఆదివారం స్వచ్ఛతా-హీ-సేవా కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోపాల్, వార్డు సభ్యులు, గ్రామస్తుడు సిద్ధిరాములు పాల్గొన్నారు.
తాండూరు రూరల్: పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మం డలం చెన్గేశ్పూర్లో స్వచ్ఛతా-హీ-సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్లను, మురుగు కాల్వలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ధారూరు: మనం నివసించే ప్రతి వీధిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సర్పంచ్ గడ్డమీది శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పూర్ణిమ పేర్కొన్నారు. ఆదివారం స్వచ్ఛత-హీ-సేవా కార్యక్రమాన్ని మోమిన్కలాన్లో నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
పూడూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం యువకులు ముందుకు రావాలని అడిషనల్ డీఆర్డీవో కె.నర్సింహులు, సర్పంచ్‌లు నవ్యారెడ్డి, బి.జయ మ్మ, రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండల పరిధిలోని అంగడి చిట్టంపల్లి, పూడూరు, తుర్కెఎన్కెపల్లి గ్రామాల్లో వేర్వేరుగా సర్పంచ్ల ఆధ్వర్యంలో స్వచ్ఛతా-హీ-సేవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం లో ఉప సర్పంచ్‌లు టి.రాజేందర్, లక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యు లు తదితరులు పాల్గొన్నారు
మర్పల్లి: పతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని ఎంపీడీవో రాజమల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని పట్లూర్ గ్రామంలో స్వచ్ఛత-హీ-సేవా కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఇందిరాఅశోక్తో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం శ్రమదానం చేశారు. కార్యక్రమంలో ఏపీఎం పోచయ్య, టీఏ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు సుకేందర్, బాలేశ్, ఐకేపీ సిబ్బంది గోపాల్, సునీత అరుణ్ పాల్గొన్నారు.