వికారాబాద్, జూలై 31 : ఏండ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్లో ఉంచుకోవడం సరికాదని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపులను నియంత్రించకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, స్పీకర్ భారత రాజ్యాంగానికి కట్టుబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను ఎవరూ శాసించలేరని.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు.