శామీర్ పేట్ : పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం నీట్, ఐఐటీ బ్రిడ్జ్ కోర్సులపై ఈ నెల 19 నుంచి అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేశవరంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జూనియర్ కళాశాల డైరెక్టర్ శ్రీకాంత్ సూచించారు. పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు జఠాధరా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కేశవరంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జూనియర్ కళాశాలలో నీట్, ఐఐటీ బ్రిడ్జ్ కోర్సులపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారని తెలిపారు.
ఈ నెల 19 నుంచి మే 21 వరకు వివిధ కార్పొరేట్ సంస్థలలో అనుభవంగల ఐఐటీ, నీట్ ఫాకల్టీ ద్వారా ఉచితంగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నీట్, ఐఐటీతోపాటు వివిధ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో ఈ సదస్సు ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని శామీర్పేట్, మూడు చింతలపల్లి మండల విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 7337285228/ 7416145227 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.