శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఈ నెల 30వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయని, ఈ శిక్షణ శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు జే.రామకృష్ణ చెప్పారు.
మారేడ్‌పల్లి, ఏప్రిల్ 28 : కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఈ నెల 30వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయని, ఈ శిక్షణ శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు జే.రామకృష్ణ చెప్పారు. శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ..30 నుంచి సిఖ్‌విలేజ్ దోభీఘాట్లోని హాకీ క్రీడా మైదానంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించనున్నట్లు తెలిపారు.
బోర్డు పరిధిలోని ఫుట్‌బాల్ మైదానం తిరుమలగిరి, కంటోన్మెంట్ గార్డెన్ బొల్లారం, సిఖ్విలేజ్లోని హాకీ మైదానంలో ఈ వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో వాలీబాల్, క్రికెట్, మార్షల్ ఆర్ట్స్, ఫుట్‌బాల్ క్రీడల్లో అనుభవజ్ఞులైన కోచ్‌లతో శిక్షణ ఇవ్వనున్న ట్లు చెప్పారు. ఆసక్తిగల క్రీడ కారులు కంటోన్మెంట్ బోర్డు కార్యలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఈ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్న వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్, ఇన్స్పెక్టర్ ఆకుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

