దోమ : సమ్మర్ క్యాంపులు( Summer Camps ) విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడమే కాకుండా సృజనాత్మకతను పెంపొందిస్తాయని డీఈవో రేణుకాదేవి ( DEO Renuka Devi ) అన్నారు. దోమ మండల పరిధిలోని బొంపల్లి ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న సమ్మర్క్యాంపు, ఏఐ తరగతులను ( AI Classes ) ఆమె సందర్శించి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు.
డీఈవో మాట్లాడుతూ సమ్మర్ క్యాంపుల ద్వారా వెనుకబడిన విద్యార్థులకు ఇంగ్లీష్ ,మ్యాథమెటిక్స్తో పాటుగా బొమ్మలు గీయడం, రంగులు వేయడం, కంప్యూటర్ పరిజ్ఞానం, కల్చరల్ యాక్టివిటీస్ వంటి కార్యక్రమాల ద్వారా చైతన్యవంతులను చేయాలని క్యాంపు నిర్వహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ షఫీ, ఏపీఎం సురేష్, గ్రామ యువకులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.