Summer Camp | దోమ, మే 1 : సమ్మర్ క్యాంపు తరగతులు విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్, మోరల్ వ్యాల్యూస్ను పెంపొందిస్తాయని ఎంఈవో వెంకట్ అన్నారు. గురువారం దోమ మండల పరిధిలోని బొంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సమ్మర్ క్యాంపు తరగతులను ప్రధానోపాధ్యాయుడు షఫీ అధ్యక్షతన ఎంఈవో వెకట్ ప్రారంభించారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షఫీ ఇండో గ్లోబల్ అవార్డు పొందిన సందర్భంగా ఆయనను గ్రామస్తులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోళ్ళ సురేష్, ఎంపీటీసీ రాములు, స్కూల్ చైర్మన్ నసీమా బేగం, మాజీ వార్డు సభ్యుడు చంద్రశేఖర్,గ్రామస్తులు బషీర్, భీమయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.