బీఆర్ఎస్ స్పోక్స్‌పర్సన్ హఠాన్మరణం
ఇబ్రహీంప ట్నం సెగ్మెంట్లో బీఆర్ఎస్లో చురుగ్గా పనిచేసే ఉద్యమకారుడు, యువజన నాయకుడు కర్నె అరవింద్ మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన అరవింద్ ఆదివారం తన బావమరిది వివాహ వేడుకలో గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలిపోగా..
- బావమరిది వివాహంలో గుండెపోటుతో కుప్పకూలిన ఉద్యమకారుడు అరవింద్
- ఆయన మృతి బీఆర్ఎస్కు తీరని లోటు : పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- నివాళులర్పించిన పలువురు బీఆర్ఎస్ నేతలు
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 : ఇబ్రహీంప ట్నం సెగ్మెంట్లో బీఆర్ఎస్లో చురుగ్గా పనిచేసే ఉద్యమకారుడు, యువజన నాయకుడు కర్నె అరవింద్ మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన అరవింద్ ఆదివారం తన బావమరిది వివాహ వేడుకలో గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలిపోగా.. వెంటనే కుటుంబీకులు అతడ్ని ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో అతడి కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.
ఉద్యమ నాయకుడిగా, స్పోక్స్ పర్సన్‌గా బీఆర్ఎస్లో చురుకైన పాత్ర పోషించిన అరవిం ద్ అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నామని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలోని అరవింద్ నివాసంలో ఆయన మృతదేహంపై బీఆర్ఎస్ జెండాను కప్పి పూలమాలవేసి నివాళులర్పించారు. అరవిం ద్ మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏ పని అప్పజెప్పినా క్షణాల్లో పూర్తిచేసే వాడని గుర్తు చేసుకున్నారు. అరవింద్ మృతితో ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ శోకసంద్రంలో మునిగిపోయిందని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎంతో కలిచి వేసిందన్నారు.
నివాళులర్పించిన నాయకులు
అరవింద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న అతడి బాబాయి కర్నె ప్రభాకర్‌తోపాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డితోపాటు కౌన్సిలర్లు, సత్తువెంకటరమణారెడ్డి తదితరులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అరవింద్ మృతి తో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ఆదివారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో అతడి అం త్యక్రియలు ముగిశాయి. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

